రెడ్ బుక్ పని ప్రారంభమైంది.. తప్పుచేసిన వారిని వదలం : లోకేష్

-

శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… తిరుమల లడ్డూ నాణ్యతాలోపంతోపాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో నా దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వచ్చాక టిటిడిని ప్రక్షాళన చేయాలని ఈఓకు చెప్పాం. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవి సుబ్బారెడ్డి రూ.150కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసిపి ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారు.

ఇక ఇప్పటికే పెన్షన్లు, మెగా డిఎస్సీ హామీలను అమలు చేశాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. పథకాల అమలుపై మాకు చిత్తశుద్ధి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్ లా పరదాలు కట్టుకుని మేం తిరగడంలేదు. తప్పు చేయకపోతే వారు ఎందుకు భయపడ్డారు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలమధ్య ప్రజావేదిక నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version