యాంకర్ గా పరిచయమైన అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూ కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది అనసూయ. కొంతకాలం నుండి యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. విభిన్న పాత్రలలో నటిస్తూ అందరినీ మెప్పిస్తోంది.
అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. పలు పోస్టులు ని పెడుతూ ఉంటుంది. తనని ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోదు వెంటనే గట్టిగా కౌంటర్లని ఇస్తుంది. తనని ట్రోల్ చేస్తున్న వాళ్ల మీద కేసు కూడా పెట్టేదాకా వెళ్ళింది. తాజాగా అనసూయ టాటూ ని చూపిస్తూ ఫోటోని పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటో షూట్ ని ఆమె పంచుకుంది ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ షికార్లు కొడుతున్నాయి.