ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా వ్వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించద్దని రీసెంట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఏపీ లో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. 400 మంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సజ్జల స్పందించారు వాలంటీర్లపై కావాలని టిడిపి రాద్ధాంతం చేస్తుందని అన్నారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం వాలంటీర్ల మీద చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ రోజు వృద్ధులు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చేదాకా వాలంటీర్లకి సపోర్టుగా మాట్లాడుతున్నారు.