మంత్రి కేటీఆర్ తో యాంకర్ ప్రదీప్ భేటీ

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రముఖ యాంకర్ ప్రదీప్ కలిశారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వికలాంగుల కోసం చేపట్టిన వాహనాల పంపిణీ నిమిత్తం ప్రముఖ యాంకర్ ప్రదీప్ మరియు అతని స్నేహితులు ముందుకు వచ్చారు…

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారిని కలిసి ఎస్.వీ ప్రొడక్షన్స్ ద్వారా ఎస్.వీ వెంకట బాబు తమవంతు సాయంగా రూ. 15 లక్షలు మరియు త్రివేణి హెచ్.డీ.పీ.ఈ పైప్స్ సంస్థ తరుపున పి. మురళీకృష్ణ, శ్రీనివాస్ లు మరో 4 లక్షల అందజేశారు. ఈ మొత్తాన్ని వికలాంగులకు అందిస్తున్న ప్రత్యేక వాహనాల కొనుగోలుకు ఉపయోగించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. తాము ఈ విధంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉందని యాంకర్ ప్రదీప్ తెలిపారు. వికలాంగులకు చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చిన యాంకర్ ప్రదీప్ మరియు తన స్నేహితులను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news