అవినీతి లేని రాష్ట్రమే నా కల: డల్లాస్ లో జగన్

-

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికన్ తెలుగు కమ్యూనిటీ పోషించిన పాత్ర ఎంతో గొప్పదని సీఎం కొనియాడారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 గెలవడం, 25 ఎంపీ స్థానాల్లో 22 గెలిచామంటే అది ఇక్కడి వారు చేసిన కృషి వల్లేనని సీఎం అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా డల్లాస్ లో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. డల్లాస్ లోని కే సెంటర్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈసందర్భంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ఖండాలు దాటిన మీ ప్రేమను, ఆప్యాయతను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని సీఎం అన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికన్ తెలుగు కమ్యూనిటీ పోషించిన పాత్ర ఎంతో గొప్పదని సీఎం కొనియాడారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 గెలవడం, 25 ఎంపీ స్థానాల్లో 22 గెలిచామంటే అది ఇక్కడి వారు చేసిన కృషి వల్లేనని సీఎం అన్నారు.

మా రెండున్నర నెలల పాలనలో చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. రెండున్నర నెలల్లోనే ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టాం. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఫీ రియంబర్స్ మెంట్ ఇస్తున్నాం. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం. నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చాం.. అని జగన్ తెలిపారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తున్నాం. దీని వల్ల అవినీతికి ఆస్కారం లేని ప్రాజెక్టు నిర్మాణాలు, టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టడం లాంటివి జరుగుతాయి. త్వరలో గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేస్తాం.. అని జగన్ తెలిపారు.

ప్రవాసాంధ్రులు ఏడాదికి కనీసం ఒకసారి లేదా రెండు సార్లు రాష్ట్రానికి రండి. ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. మన గ్రామాలను మనమే బాగు చేసుకుందాం. నా మీద, నాన్న గారి మీద మీ చెక్కుచెదరని ప్రేమాభిమానాలకు నేను సెల్యూట్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న మిమ్మల్ని చూసి అక్కడ మేము ఎంతో గర్వపడుతున్నాం.

చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అవినీతి లేని రాష్ట్రంగా చూడాలన్నదే నా చిరకాల స్వప్పం అని జగన్ ప్రవాసాంధ్రులను ఉద్దేశించి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news