పవన్ ఓటమిపై మొదటిసారి స్పందించిన మెగాస్టార్…!!!

1945

ఏపీలో గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం, చివరికి పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం అందరికి తెలిసిందే. పవన్ ఓటమి విషయంలో ఎంతో మంది ఎన్నో రకాల కామెంట్స్ చేశారు. కానీ తన మెగా ఫ్యామిలీ నుంచీ ఒక్క కామెంట్ కూడా రాలేదు. చిరంజీవి సైతం పవన్ రాజకీయ పరిణామాలపై నోరు మెదపక పోవడం సంచలనం సృష్టించిది. అయితే

చాలా రోజుల తరువాత చిరు తన తమ్ముడి ఓటమి, రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి డ్యాన్స్ అంటే తెలియని వయసులో జ్యోతి లక్ష్మి పాటలు వింటుంటే తెలియకుండానే మూమెంట్స్ వచ్చేవని, అప్పటి వరకూ నాలో ఓ డ్యాన్సర్ ఉన్నాడనే విషయం  నేను గ్రహించాలేదని. డ్యాన్స్ లో నా తొలి గురువు జ్యోతి లక్ష్మి అని చెప్పి  మెగాస్టార్ అనిపించాడు.  

ఇక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన విషయాల గురించి ప్రస్తావిస్తూ. పవన్ కి వ్యక్తిత్వం ఎక్కువ ఎప్పుడూ తన నీడలో ఉండాలని అనుకోకుండా వ్యక్తిగతంగా ఎదగాలని భావించేవాడు. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులకి భయపడిపోయే వ్యక్తికాదు. పవన్ ఒక ఫైటర్ నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. కానే ఎదో ఒక సమయంలో అతడు విజయం సాధిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్.