ఆంధ్రులూ ఆందోళన చెందొద్దు… వాస్తవాలివి!

-

నిద్రపోతున్న వాడిని లేపవచ్చు కానీ… నిద్ర నటిస్తున్న వాడిని మాత్రం లేపలేము అన్నట్లుగా ఉంది ఏపీలో ఒక వర్గం మీడియా, కొందరు స్వార్ధ రాజకీయ నాయకుల పని! అవును… ఇలాంటి కీలక సమయాలను కూడా రాజకీయాలకు వాడుకోవాలని భావిస్తున్న వారిని చూసి జాలిపడాలో, కోప్పడాలో, వీరంతా ఏపీలోనే అధికంగా ఉన్నందుకు బాదపడాలో తెలియని పరిస్థితి! అవును… ఏపీలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుంది. కరక్టే…. కాని పెరుగుతున్న టెస్టుల సంఖ్యే దీనికి కారణం అని ప్రభుత్వాలు ఎన్ని మొత్తుకున్నా… ప్రజలను ఆందోళనలో పడేసే కామెంట్లు, పిచ్చి పిచ్చి కథనాలు రాస్తున్న వారి రాతలు, కూతలు మారడం లేదెందుకు? అలాంటివార్కోసమే మరో పక్కా సమాచారం!

కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని, దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ చెబుతున్నారు. ఇదే విషయాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందిస్తూ…. రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్నామని.. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల మందికి పరీక్షలు చేస్తున్నామని, ఈ సంఖ్యను పది వేలకు తీసుకువెళ్లేందుకు కృషి చెస్తున్నామని చెబుతున్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ టెస్టులు చేస్తున్నామని చెబుతున్నారు. ఇదేదో కొందరు రాజకీయ నాయకులు మైకుల ముందు చెప్పే అసత్యాలో, రాజకీయ ఆరోపణల్లో భాగంగా చెప్పిన మాటలో కాదు…. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ లో చెప్పిన మాట!

అవును… 80 కేసులు, 60 కేసులు, 60 కేసులు ఎక్కడికి పోతున్నాం మనం.. అని కామెంట్లు చేస్తున్నవారికి సరైన సమాధానం ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో దేశం మొత్తానికి ఏపీ సీఎస్ క్లారిటీగా చెప్పిన మాట. అదేవిధంగా… జనాలను భయబ్రాంతులకు గురిచేసేవారి మాటలు, రాతలపై ఏపీ సీఎం తనదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో తీవ్ర ఆందోళనకు బదులు ధైర్యం, భరోసా, స్థైర్యం, అవగాహన, జాగ్రత్తలు పాటించేలా, చైతన్యం కలిగించేలా ప్రవర్తించాలని సూచిస్తున్నారు!!

సరే… ఎవరు ఎన్ని రాజకీయ కామెంట్లు చేసినా… కేవలం కొత్త కేసుల సంఖ్యలు మాత్రమే చూపిస్తూ, తెలిసి కూడా టెస్టుల సంఖ్యలు దాస్తూ.. పనికిమాలిన రాజకీయాలకోసం ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న ఈ సమయంలో… ఏపీ ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు సూచిస్తున్నారు. ఈ సమయంలో టెస్టుల సంఖ్య ఎంత పెరిగితే అంత మంచిది! తద్వారా ఉన్న అన్ని కేసులూ బయట పడతాయి! వీలైనంత తొందరగా కరోనా విముక్త రాష్ట్రంగా మారొచ్చు!

Read more RELATED
Recommended to you

Latest news