రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పై ఆర్ధిక ఒత్తిడిని తగ్గించడానికి గానూ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. రూ .50 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాన్ని (ఎస్‌ఎల్‌ఎఫ్-ఎంఎఫ్) సోమవారం ప్రకటించింది. మూలధన మార్కెట్ లో పెట్టుబడి కొరత ఎక్కువగా ఉంది. దీనిపై ఆర్బిఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆర్‌బిఐ అప్రమత్తంగా ఉందని, కరోనా ఆర్ధిక నష్టాలను తగ్గించడానికి… అలాగే ఆర్ధిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి గానూ అవసరమైన ఏ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఎంఎఫ్‌లపై ద్రవ్య ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో, ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఆర్బిఐ 90 రోజుల టెనార్ యొక్క రెపో ఆపరేషన్లను నిర్ణీత రేటుతో నిర్వహించాలని…
సోమవారం నుండి శుక్రవారం వరకు (సెలవులను మినహాయించి) బ్యాంకులు తమ బిడ్లను సమర్పించవచ్చని ఆర్బిఐ తెలిపింది. “ఈ పథకం ఈ రోజు నుండి… అంటే ఏప్రిల్ 27, 2020 నుండి మే 11, 2020 వరకు లేదా కేటాయించిన మొత్తాన్ని ఉపయోగించుకునే వరకు ఉంటుందని చెప్పింది. ఏది ముందు అయితే అది అని పేర్కొంది. కాగా ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక మాంద్యం రాకుండా ఉండటానికి పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.