అవినాశ్ ఓడిపోతారనే మార్చుతున్నారా..? : షర్మిల

-

కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రజలు ఓట్లు వేయరు.. అవినాశ్ ఓడిపోతారనే మారుస్తున్నారా..? ఆయనను మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతున్నారా..? హత్యా రాజకీయాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలి అన్నారు షర్మిల. ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో.. హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు.

కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వై.ఎస్.షర్మిల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒకే కుటుంబం నుంచి షర్మిల, అవినాశ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అవినాశ్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని పలువురు చర్చించుకుంటున్నట్టు సమాచారం. సీఎం జగన్ మాత్రం అవినాశ్ రెడ్డి పై నమ్మకంతో కడప ఎంపీగా మళ్లీ అవినాష్ రెడ్డినే కొనసాగుతారని.. ఈనెల 22న సీఎం జగన్ తరపున పులివెందులలో అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప ఎంపీగా షర్మిల విజయం సాధిస్తుందో.. అవినాశ్ రెడ్డి గెలుస్తారో తెలియాలంటే జూన్ 04 వరకు వేచి చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news