కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు.. కాపు ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ.. ఇద్దని తప్పుపడుతున్నారు.. ఇవాళ కిర్లంపూడిలో ముద్రగడను కలిశారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చెందిన కాపు నేతలు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు నాయుడే అంటూ ఫైర్ అయ్యారు.. ఇచ్చిన హమీని అమలు చేయకుండా.. రోడ్డెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడన్న ఆయన గతంలో చంద్రబాబు పక్కన ఉన్న పవన్ కల్యాణ్.. ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాను.. కానీ ఓటర్లు అమ్ముడు పోతారనే భావాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముడు పోయిన వారిగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా బాధకరంగా ఉందన్నారు ముద్రగడ.