E-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలో ప్రారంభమైందని తెలిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తన హయాంలో ప్రారంభమైన ఈ స్టాపింగ్ విధానాన్ని చంద్రబాబు జీరాక్స్ కాపీలు అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని.. మోడీ, అమిత్ షాతో చెప్పించగలరా..? అని ప్రశ్నించారు సజ్జల. భూముల సమగ్ర సర్వే పూర్తి అయిన తరువాతనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తుందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనంను చంద్రబాబు భయపెడుతున్నారు. వీళ్ళు మనుషులా?పిశాచులా ?ఈ బిల్లు సమయంలో అసెంబ్లీ లో టిడిపి ఎందుకు మద్దతు ఇచ్చింది ? ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. 2019 జూలై లో అసెంబ్లీ లో టీడీపీ నేత పయ్యావుల కేశవులు మద్దతుగా మాట్లాడారు. E stamping విధానం 24 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు. వ్యవస్థల మీద నమ్మకం లేని ఉగ్ర వాదుల చర్యలల చంద్ర బాబు తీరు ఉంది. చంద్ర బాబు ఇచ్చిన ఆరు హామీల అమలు చేయలేనని ఆయనకు తెలుసు. అందుకే ప్రజల్లో అపోహలు భయాందోళనలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్ర బాబు.