ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో నెలకొంటున్న శాంతి భద్రతల సమస్యలు, వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ ని బదిలీ చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో ఆయన స్థానంలో.. ఆంధ్రప్రదేశ్ నూతన ఇన్ఛార్జి డీజీపీగా ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చిని నియమించింది. కాగా ఆయన ఇవాళ ఇన్ చార్జీ డీజీపీ గా భాద్యతలు స్వీకరించారు. ఏపీ నూతన డీజీపీ నియామకం పై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవీలో కొనసాగుతారు. ఇదిలా ఉండగా.. ద్వారాకా తిరుమలరావు కొత్త డీజీపీ గా ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.