విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్ న్ను కనుబొమ్మపై గాయం అయ్యింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఓ మైనర్ బాలుడు తాను రాయి విసిరినట్లు అంగీకరించారు.
అతడినీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే నేడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో నేడు ఏప్రిల్ 27 సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామన్నారు. అమలు చేసేవే హామీలుగా ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో కూడా ఎవ్వరూ ఇచ్చిన హామీలను అమలు పరచలేదని.. తాను 2019 ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ నుదుటిపై బ్యాండేజ్ లేకుండా కనిపించారు. పైగా జగన్ నుదుటిపై చిన్న మరక కూడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పరోక్ష పార్టీలు మరిన్ని విమర్శలు గుప్పిస్తున్నారు.