చంద్రబాబు పై పేర్ని నాని విమర్శలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు పై పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులకు ఎప్పుడైనా ఇంటికి వెళ్లి నువ్వు పెన్షన్ ఇచ్చారా..? నిన్నటివరకు వాలంటీర్ల మీద విరుచుకుపడితివి. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లను తిట్టి పట్టుమని 10 నెలలు కూడా కాలేదని తెలిపారు పేర్ని నాని. నిమ్మగడ్డ రమేష్ కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదా.? 

మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పెన్షనర్లకు డబ్బులు వెళ్లకుండా ఆపింది ఎవరు..? అని ప్రశ్నించారు. ఇంటికి వెళ్లి పేదలకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ? అని ప్రశ్నించారు. వాలంటీర్లకు రూ.50వేలు వచ్చేటట్టు చేస్తాడటా చంద్రబాబు. వాలంటీర్లను తగులుకుంటే ఓట్లు పడతాయని చంద్రబాబు ఎర వేస్తున్నారు. రామారావు పై ఎలా వెన్ను పోటు పొడిచారో.. ఇప్పుడు వాలంటీర్లపై కూడా అలాగే చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news