ఫ్యామిలీ స్టార్… బుకింగ్ అదుర్స్

-

పరశురాం దర్శకత్వంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’.. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Family Star

థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి.ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.ఈ సినిమా ను తెలుగుతో పాటుగా తమిళం, హిందీలో కూడా విడుదల కాబోతుంది.ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ ఏం లేకపోవడంతో ఫ్యామిలీ స్టార్‌కి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తుంది.హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులు “ఫ్యామిలీ స్టార్” చూడాలనుకుంటున్నారు.ఫ్యామిలీ స్టార్” మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news