ఏపీలో మరోసారి రాక్షస ముఠా ఏకమైంది : సజ్జల

-

రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ముఖ్య నాయకులు గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ టీడీపీపై దాదాపు యుద్ధాన్నే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇవాళ ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి టీడీపీపై మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ అక్రమాలపై ‘మహా దోపిడీ’ పుస్కకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయారో.. కేంద్ర, రాష్ట్ర నిధులను చంద్రబాబు ఎలా మింగేశాడో ఆ దోపిడీకి సంబంధించి విషయాలను ‘మహా దోపిడీ’ పుస్తకంలో చక్కగా వివరించారని తెలిపారు. బాబు మోసాలు ప్రజలకు కూడా అర్ధం అయ్యాయని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలు రావడంతో మరోసారి రాక్షసుల ముఠా మొత్తం ఏకమైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం బీజేపీ, పవన్ ను బాబను వాడుకున్నోడికి.. వాడుకున్నంతలా వాడేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ మూడు పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పదం చేసుకున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news