ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ రాజకీయ నేత ఇంట్లో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. తాజాగా ముప్పాళ్ల మండలం మాదలలో ఓ రాజకీయ నేత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.పోలీసుల సోదాలలో ఇంట్లో దాచి ఉంచిన 29 పెట్రోల్ బాంబులను గుర్తించారు.ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య పలు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. రాళ్లు, కుర్రలతో పరస్పరం తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ,పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.