ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాద్ వాతావరణం సాధారణంగానే ఉండింది. ఉన్నట్టుండి సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరమంతా జలమయం అయింది. ఉప్పల్ స్టేడియంలో కూడా వర్షం కురవడంతో మ్యాచ్ జరుగుతుందా..? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరుణంలోనే ఉప్పల్ లో జరిగే మ్యాచ్ పై HCA కీలక అప్ డేట్ ఇచ్చింది. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 గంటల వరకు సమయం ఉన్నదని పేర్కొంది. వర్షపు నీటిని పూర్తిగా డ్రైనౌట్ చేసి గ్రౌండ్ ను సిద్ధం చేసేందుకు దాదాపు 100 మందికి పైగా తీవ్రంగా శ్రమిస్తున్నట్టు వెల్లడించింది హెచ్సీఏ. ముఖ్యంగా సన్ రైజర్స్ అభిమానులు, హెచ్ సీఏ సిబ్బంది నిరుత్సాహ పడవద్దని హెచ్ సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు తాజాగా వెల్లడించారు. మరోవైపు అభిమానులు మాత్రం మ్యాచ్ కచ్చితంగా జరగాలి.. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవాలి అని కోరుతున్నారు.