నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్ ప్రకారం మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి.
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉత్తర కోస్తా అంతటా..మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా..తీరం ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. దీంతో సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉందని.. మత్స్యకారులు రానున్న 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.కాగా ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.కాళేశ్వరం వద్ద మొదటి సారి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.