మధ్య ప్రదేశ్ లోని భోపాల్ నగరానికి చెందిన హర్షిత్ అనే 22 ఏళ్ల యువకుడు చదువు కోసం లండన్ వెళ్లి కొత్త వ్యాపార ఆలోచనతో ఇండియాకు వచ్చి కోట్లు సంపాదిస్తున్నాడు.బీబీఏ చదువుతున్న క్రమంలో హర్షత్ లండన్కి వెళ్లాడు. ఆ సమయంలో ఒకసారి అవకాడో తింటుండగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాడు. వాటిని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అతను తెలుసుకున్నాడు.
ఈ అవకాడోల ప్రత్యేకతతో పాటు వాటి సాగు పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇజ్రాయెల్ రైతులతో పాటు అవకాడో నిపుణులను సంప్రదించడం ప్రారంభించాడు ఈ యువకుడు.వాటికున్న ప్రత్యేక నాణ్యత వల్లే లండన్ ఇంజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గమనించాడు. తాను బీబీఏ చదువుతున్న క్రమంలో తన ఇంటర్న్‌షిప్ని విడిచిపెట్టి అవకాడో వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి బాగా అభివృద్ధి చెందిన అతి చిన్న దేశం అయిన ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు.
కొన్ని రోజులు దాని గురించి నేర్చుకున్న తర్వాత లండన్‌కు తిరిగి వచ్చి తన విద్యను పూర్తిచేశాడు. ఆ తర్వాత ఇండియా తరిగివచ్చి దేశంలో ఇజ్రాయెలీ అవకాడోలను పండించడంపై బాగా దృష్టి సారించాడు. అయితే ఈ ప్రయాణంలో 2019 సమయంలో హర్షిత్ భోపాల్‌లో ఇండో ఇజ్రాయెల్ అవకాడో అనే తన అగ్రి-స్టార్టప్‌ను స్టార్ట్ చేశాడు. దీనికోసం మొత్తం రూ.50 లక్షలు వెచ్చించి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దానిని హైడ్రోపోనిక్ సిస్టమ్‌తో కూడిన పాలీహౌస్‌గా, ఆవకాయ నర్సరీగా అతను మార్చాడు.
ఇక ఈ క్రమంలో మెుక్కలను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవటాని కరోనా మహమ్మారి అనేది అతనికి పెద్ద అడ్డంకిగా మారింది. అయితే ఇంపోర్ట్ పర్మిట్ పొందడానికి చాలా టైం పట్టడంతో మొక్కలు రవాణా చేయడానికి చాలా పెద్దవిగా మారాయి. దీంతో షిప్పింగ్ ఖర్చు ఐదు నుంచి ఆరు రెట్లు పెరిగాయి. అలా 2021 వ సంవత్సరంలో హర్షత్ 20,000 మెుక్కలను దిగుమతి చేసుకున్నాడు. భోపాల్ సిటీ విమానాశ్రయం దగ్గరలోని ఐదెకరాల స్థలంలో తన అవకాడో తోటను అతను ప్రారంభించాడు.ఇంకా దీనికి తోడు రైతులకు మెుక్కలను అమ్మడం మెుదలుపెట్టాడు. వారికి మెుక్కల నాటడం నుంచి దిగుబడి దాకా అన్ని వేళలా ఫ్రీగా సపోర్ట్ అందిస్తున్నాడు.
ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మధ్యప్రదేశ్ ఇంకా మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్రాల్లోని రైతులకు అమ్మాడు. రాబోయే కాలంలో తన సాగును 100 ఎకరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు.ప్రస్తుతం తన 5 ఎకరాల తోట నుంచి సంవత్సరానికి ఏకంగా రూ.50 లక్షలు సంపాదిస్తున్నాడు. అలాగే మెుక్కలను అమ్మటం ద్వారా ఏకంగా రూ.కోటి సంపాదిస్తున్నాడు. 28 ఏళ్ల హర్షిత్ భోపాల్‌లోని న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ముందుకు కొనసాగుతున్నాడు. భవిష్యత్తులో తోట ద్వారా ఏటా రూ.10 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుని అతను ముందుకు సాగుతున్నాడు. ఇక నుంచి అవకాడో మొక్కలతో పాటు హర్షిత్ భారతదేశం అంతటా రిటైల్, హోల్‌సేల్ మార్గాల ద్వారా అవకాడో పండ్లను కూడా అమ్మనున్నాడు. ఇలా హర్షిత్ తన తెలివి తేటలతో పైకి ఎదుగుతూ నేటి యువతకి ఆదర్శంగా మారాడు.