ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జాబ్స్.. నెలకు రూ.1,47,760ల జీతం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు లో కొన్ని జాబ్స్ ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు లో 39 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక ఎవరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే.. ఈ పోస్టులకి ఆర్ట్స్/సైన్స్/కామర్స్ విభాగంలో డిగ్రీ, ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.

వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే జనవరి 25, 2023వలోపు అవకాశం వుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ అభ్యర్ధులు రూ.1000లు చెల్లించాలి. అదే ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.500లు కట్టాలి.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఫిబ్రవరి 4, 2023న వుంటుంది. జీతం నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల దాకా జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలని https://hc.ap.nic.in/recruitment.html లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version