కరోనా వైరస్ అనే మహమ్మారిని ఎదుర్కొనటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రదేశాలు నానా తిప్పలు పడుతున్నాయి. సైనిక పరంగా టెక్నాలజీ పరంగా మా కంటే వేరే దేశాలు ఏవి లేవు అని మొన్నటి వరకు అనుకున్న దేశాలు ఈ వైరస్ దెబ్బకి భారీ మూల్యం చెల్లించు కుంటున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అని పిలవబడే అమెరికాలో కరోనా వైరస్ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. రోజుకి లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా…వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో ఎక్కువగా నమోదవుతున్నాయి యువత అని వైద్యులు తెలుపుతున్నారు. అన్ని చోట్లా ఒకేలా ఉంటే ఏపీలో ఈ విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వృద్ధుల పై కంటే యువతపై ప్రభావం చూపడం పట్ల వైద్యులు కూడా షాక్ అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏపీ లో ఉన్న యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.