ఇంటి బయట శానిటేషన్ చేసుకుంటున్న చిరంజీవి…!

-

కరోనా వైరస్ మొదలైన నాటి నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించడానికి గానూ ఏదోక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ సహా అందరూ కూడా విస్త్రుత ప్రచారం కల్పిస్తున్నారు. రామ్ చరణ్… లాక్ డౌన్ లో ఎలా ఉండాలో చెప్తుంటే చిరంజీవి సోషల్ మీడియాలో పాటలు పాడుతున్నారు.

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక పోస్టర్ ని పోస్ట్ చేసారు దీనికి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిరంజీవి ఒక వీడియో తో అభిమానులను పలకరించారు. తన ఇంటి బయట శానిటేషన్ చేస్తూ కనిపించారు. ద్రావణాన్ని స్ప్రే చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రేయాస్ మీడియా గ్రూప్ దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకి కూడా మెగా ఫ్యామిలీ కాస్త వేగంగా స్పందిస్తూ వస్తుంది. జనతా కర్ఫ్యూ, ఆ రోజు సాయంత్రం చప్పట్ల శబ్దం, కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం వంటివి ఘనంగా నిర్వహించారు. ఫ్యామిలీ మొత్తంగా కూడా సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు. తాజాగా పోస్ట్ చేసిన వీడియో కి మంచి స్పందన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version