త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది. ఇందుకోసం విద్యాశాఖ రేపు( సోమవారం) టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. జులై 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. మిగతా వివరాలకు http://cse.ap.gov.in/ అనే వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సూచించింది.

టెట్‌ ఫలితాల్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల వెల్లడించారు. ఆ తరువాత మెగా డీఎస్సీ ఉండబోతుందని తెలిపారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్‌ నిర్వహిస్తామన్న హామీ మేరకు సోమవారం నాడు టెట్ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.

కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేస్తుండడంతో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదివారం జీవో జారీ చేసింది. గత ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టుల కు నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news