విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు భారీ స్థాయిలోనే… పరిహారం ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది ఏపీ సర్కార్. ఒక్క కుటుంబానికి 25 వేల రూపాయలు అందించేలా.. చర్చలు నిర్వహిస్తోంది. బాగా నీట మునిగిన ఇండ్లకు… 25 వేల రూపాయలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. అలాగే కొంతమేర… మునిగిన ఇండ్ల వారికి… ఒక్కొకరి చొప్పున 10 వేల రూపాయలు సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో ఆటోలు, టాక్సీల రిపేర్లకు పదివేల రూపాయలు… బైకులు ఉన్నవారికి 3000 చొప్పున ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విజయవాడ ప్రాంతంలో పంటలు.. తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఆ రైతులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం పైన… రెండు రోజుల్లో క్లారిటీ రానుందట. కేంద్రం నుంచి ఎంత సహాయం వస్తుంది అనే దానిపైన.. అంచనా వేసుకుని ఆ తర్వాత పరిహారం ప్రకటించనుంది చంద్రబాబు సర్కార్.