నేలకూలిన 150 ఏళ్ల ‘వృక్షం’.. ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్

-

కొన్ని కట్టడాలు.. వృక్షాలు.. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల, వేల ఏళ్ల నుంచి పటిష్ఠంగా చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. కానీ అనుకోకుండా ఏదోరోజు వాటికీ ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అవీ కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ అక్కడ చోటుచేసుకున్న సంఘటనలు.. వాటి తాలూకు జ్ఞాపకాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టు.

దాదాపు 150 ఏళ్ల కాలం నాటి ఈ భారీ వృక్షం తాజాగా నేలకొరిగింది. ఈ చెట్టు నీడన దాదాపుగా 300 సినిమాల్లోని సీన్స్, సాంగ్స్ షూట్ చేశారు. ముఖ్యంగా దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు తమ కెరీర్లోని అత్యద్భుత సినిమాలను ఇక చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రహీరోల సినిమాల్లోని కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. ఏటా వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయి.. తాజాగా ఈ వృక్షం నేలకొరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version