టీడీపీ, జనసేన కూటమికి 17 పార్లమెంట్ స్థానాలు – వైసీపీ ఎంపీ

-

టీడీపీ, జనసేన కూటమికి 17 పార్లమెంట్ స్థానాలు, వైకాపాకు 8 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆజ్ తక్, సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యిందని తెలిపారు వైసీపీ ఎంపీ రఘురామ. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా జత కడితే కచ్చితంగా 21 స్థానాలకు పైగానే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ప్రతి ఏటా తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ ల రూపంలో టైమ్స్ నౌకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయిస్తున్నందుకు ప్రతిఫలంగా ప్రతిసారి సర్వేలలో ఆ సంస్థ యాజమాన్యం వైకాపాకు 25కు 25 స్థానాలు అన్నారు.

లేదంటే 24 స్థానాలను కేటాయిస్తూ వచ్చేదని, ఈసారి టైమ్స్ నౌ యాజమాన్యం కూడా మొహమాట పడినట్లు కనిపిస్తుందని, అందుకే ఈసారి సర్వే ఫలితాలలో వైకాపాకు 19 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొందని, భవిష్యత్తులో వాళ్లు కూడా ఆ సంఖ్యను తొమ్మిదికి కుదించే అవకాశాలు లేకపోలేదని అన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించి ప్రజలు తాము చేసిన తప్పుకు కుమిలిపోతున్నారని, చంద్రబాబు నాయుడు గారి వంటి అభివృద్ధి కాముకుడిని, కార్యదీక్షపరుడిని ఈసారి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news