తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్నటితో పోల్చితే.. ఇవాళ తిరుమలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచివున్నారు.
ఇక టోకేన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 84401 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, 37, 738 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్లుగా నమోదు అయింది.
కాగా, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా మరో చిరుత పులి భక్తులకు కనిపించడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడకదారి లో ఇవాళ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత పులి కనిపించింది. దీంతో వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో టిటిడి అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు. ఆ చిరుత రాకపై ఆరా తీస్తున్నారు.