కమలం కొత్త టార్గెట్..కారు ‘ఫెయిల్యూర్’..!

-

తెలంగాణలో మళ్ళీ పుంజుకోవడానికి బి‌జే‌పి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల బి‌జే‌పిలో జరిగిన మార్పులు..అటు కాంగ్రెస్ బలపడటంతో.. బి‌జేప అనూహ్యంగా రేసులో  వెనుకబడింది. మొన్నటివరకు బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం బి‌జే‌పి దూకుడు మీద ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక కాస్త సైలెంట్ అయింది. దూకుడుగా కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడటం లేదు. ప్రజా క్షేత్రంలో పెద్దగా పోరాటాలు చేయడం లేదు.

BJP-party

పైగా సీనియర్ నేతల మధ్య సఖ్యత లేదు..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు రాజకీయం నడిపిస్తున్నారు. ఈ పరిణామాలు తెలంగాణలో బి‌జే‌పిని బాగా వెనుకబడేలా చేశాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ బి‌జే‌పిని రేసులోకి తీసుకురావడానికి సరికొత్త కార్యాచరణతో బి‌జే‌పి ముందుకొస్తుంది. ఈ క్రమంలోనే ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లనుంది. గతంలో కే‌సి‌ఆర్ ఏ ఏ హామీలు ఇచ్చి..వాటిని అధికారంలోకి వచ్చాక సరిగ్గా అమలు చేయడం లేదో వాటిపై పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యని ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగభృతి ఇస్తానని కే‌సి‌ఆర్ హామీ ఇచ్చారు..కానీ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదు. అలాగే రైతుల సమస్యలు, రుణమాఫీ, బీసీ బంధు, దళితులకు మూడు ఎకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..ఇలా పలు రకాల హామీలపై కే‌సి‌ఆర్ మాట తప్పడంపై పోరాటం మొదలుపెడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలు పర్యటించి..కే‌సి‌ఆర్ ఏ ఏ హామీలు అమలు చేయలేదు. ఏ హామీల్లో కోతలు విధించారో వాటిని ప్రజలకు వివరించనున్నారు. అంటే హామీలు అమలులో ప్రభుత్వం ఫెయిల్యూర్ పై పోరాటం చేయనున్నారు. ఇక ఈ పోరాటం ప్రజల్లోకి ఎంతవరకు వెళుతుంది..ప్రజలు ఎంతవరకు బి‌జే‌పి చెప్పేవి నమ్ముతారు..బి‌జే‌పికి ప్రజా మద్ధతు ఎంతవరకు పెరుగుతుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news