ఏపీ ప్రజలకు తీపికబురు. డిసెంబర్ నాటికి 2.63 లక్షల టిడ్కో ఇల్లు పూర్తి కానున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ల విలేకరులతో మాట్లాడుతూ… ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2.63 లక్షల టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు తప్పనిసరిగా అందిస్తామని చెప్పారు.
వైసిపి ప్రభుత్వం రూ.14 వేల కోట్ల ఆదనపు భారం మోస్తూ ఇళ్లను పూర్తిచేస్తుందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక 300 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి రుణ వాయిదాలేవి చెల్లించాల్సిన పని లేకుండా, ఒక్క రూపాయితోనే అక్క, చెల్లెమ్మలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. దీనిపై టిడిపి విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.