సంయుక్త మీనన్ కు మరో బంపర్ ఆఫర్

-

సంయుక్త మీనన్… ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు సినిమాలు సక్సెస్ చేసిన బ్యూటీ… తెలుగులో వరుస ఆఫర్లు కూడా సాధిస్తోంది. రీసెంట్గా సంయుక్త మీనన్, సాయిధరమ్ తేజ్ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. చాలా కాలంగా సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్ కు లక్కీ హీరోయిన్ గా మారి సూపర్ సక్సెస్ ఇచ్చింది సంయుక్త.

విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండటంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. దీంతో అమ్మడి కోసం నిర్మాతలు, దర్శకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సంయుక్తకు మరో భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప 2’ తో బిజీగా ఉన్న బన్నీ నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు హీరోయిన్లలో ఒకరిగా సంయుక్తకు త్రివిక్రమ్ నుంచి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే సంయుక్తకు టాలీవుడ్ లో ఇక తిరుగు ఉండదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news