ఏపీలో 2024లో 20 సాధారణ సెలవులు.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం

-

ఏపీ విద్యత్తులు, ఉద్యోగులకు బిగ్ అలెర్ట్. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఎడాది సెలవు దినాలు కలిసొచ్చాయి. సాధారణ, ఐచ్చిక సెలవుల క్యాలెండర్ 2024ను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు 2024 సంవత్సరానికి గాను 20 సాధారణ సెలవులు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

20 Common Holidays in AP in 2024
20 Common Holidays in AP in 2024

ఇక ఐచ్చిక సెలవులు 17 రోజులు, 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా ఐదు ఐచ్చిక సెలవులను వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. చంద్ర దర్శనం బట్టి మారే రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉల్ నబీ వంటి పర్వదినాలతో పాటు తిధుల ప్రకారం మారే హిందూ పండుగల వివరాలను తర్వాత ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణ ఉత్తర్వులు వచ్చేవరకు ఆగకుండా ఆయా శాఖాధిపతులు తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news