తిరుమల శ్రీ వారి భక్తులకు బిగ్ అలెర్ట్..తిరుమల శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. అయితే ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. ఇక ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.72 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం చిన్నశేష వాహనం తిరుగనుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల శ్రీవారు. అలాగే తిరుమల శ్రీవారి గరుడోత్సవాన్ని 19వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిర్వహిస్తారు టిటిడి అధికారులు.