2050 నాటికి పక్షవాతంతో కోటి మరణాలు : ‘ద లాన్సెట్‌’ నివేదిక

-

2050 సంవత్సరం నాటికి పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య దాదాపు కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ‘ద లాన్సెట్‌’ వెల్లడించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది. అంతే కాకుండా.. దీనికోసం ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని తెలిపింది. అయితే ఈ మరణాలు తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే ఎక్కువగా ఉంటాయని తన నివేదికలో వివరించింది. 2020లో పక్షవాతంతో చనిపోయినవారి సంఖ్య 66 లక్షలుగా ఉందని ద లాన్సెట్ పేర్కొంది.

గత 30 ఏళ్లలో పక్షవాతంతో మరణించే, వైకల్యం బారినపడే వ్యక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 2020లో పక్షవాత మరణాలు అత్యధికంగా ఆసియాలో 61 శాతం ఉన్నాయి. 2050 నాటికి 69 శాతానికి పెరుగుతాయి. అని ద లాన్సెట్ నివేదికలో వెల్లడించింది.

ది లాన్సెట్ ఈ నివేదికలో ఈ మరణాలు తగ్గించడానికి సూచనలు చేసింది. ఈ మరణాల నివారణకు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని.. ఇందుకోసం డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని వెల్లడించింది. ఈ మరణాలను ఎదుర్కోవడానికి సరిపడా వైద్య సిబ్బంది, మందులు, మౌలిక సదుపాయాలను పెంచాలని… సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే పక్షవాత బాధితుల్లో అకాల మరణాలను తగ్గించొచ్చని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news