చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కు అసెంబ్లీలో తీర్మాణం : సీఎం చంద్రబాబు

-

చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మాణం చేస్తామని ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు.  పార్లమెంట్ లో ఇది చట్టరూపం దాల్చే విధంగా పోరాటం చేస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తామన్నారు. చేనేత కారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని.. అలాగే జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

నామినేటేడ్ పోస్టులలో బీసీలకు న్యాయం చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్ పదవులను బీసీలకే ఇచ్చామని.. మంత్రి వర్గంలో కూడా అగ్రస్థానం కల్పించిన పార్టీ మాదే అన్నారు. ఆది నుంచి బీసీలు పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తీసుకొస్తామని తెలిపారు. ముఖ్యంగా ఏపీలో ఏశాఖలో చూసినా దోపిడి, విధ్వంసం, అవినీతి వ్యవస్థల నిర్వీర్యమే కనబడుతోందన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి నిర్వీర్యమైంది అన్నారు. ఇబ్బందులున్నాయని ఇచ్చిన హామీలను వదిలిపెట్టలేదన్నారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news