విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడ అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కొండ దిగువన వినాయక స్వామి ఆలయం వద్ద నుంచీ విజయవాడ అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇంద్రకీలాద్రి మీదకు వచ్చిన తరువాత గంట సమయం దర్శనం కోసం పడుతోంది.

విఐపీ లైన్లు ఫుల్ అయిపోవడంతో 300 రూపాయల క్యూలైన్ కు డిమాండ్ పెరుగుతోంది. అటు వీఐపీ, వీవీఐపీ లైన్లలో భారీగా రద్దీ నెలకొంది. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ఇవాళ తెల్లవారు ఝామున 4 గంటల నుంచీ క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. అటు ఇవాళ ఆదివారం కావడం తో భారీ సంఖ్య లో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో అన్న ప్రసాదం, లడ్డు ప్రసాదం ఎప్పటికప్పుడు అందుబాటులో ఆలయ అధికారులు ఉంచుతున్నారు.