ట్రంప్ గెలుపు కోసం శ్రమిస్తున్న ఎలాన్ మస్క్..

-

ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఎలాన్ మస్క్‌కు తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని మాజీ అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, అతనికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తానని ట్రంప్ అన్నారు. ‘గవర్నమెంట్ ఎఫిషియెన్సీ కమిషన్’ని ఏర్పాటు చేసి దానికి చీఫ్‌గా ఎలాన్ మస్క్‌ని నియమిస్తానని వెల్లడించారు. అదేవిధంగా దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌లో భారీ కోత పెడతానన్నారు.


ఈ క్రమంలోనే ట్రంప్ గెలుపుకోసం ఎలాన్ మస్క్ సాయం చేస్తున్నట్లు, భారీగా ఫండింగ్ చేస్తున్నట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. అయితే, వాటిని మస్క్ తోసిపుచ్చారు. మొన్నటివరకు కమలా హ్యారీస్‌కు మద్దతుగా నిలిచిన అమెరికన్ ప్రజలు మళ్లీ ఇప్పుడు ట్రంప్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ట్రంప్ విజయానికి మస్క్ శాయశక్తులా కృషి చేస్తున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. బైడెన్,హ్యారీస్ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపడంతో పాటు, 4 లక్షల మంది క్రిమినల్స్‌ను డెమొక్రటిట్ ప్రభుత్వం విడుదల చేసిందని, ఇది భయానకం అని మస్క్ ఫైరయ్యారు. తాజాగా మస్క్ ఎక్స్‌లో పెట్టిన లైవ్‌ను ఏకంగా 1.2 కోట్ల మంది వీక్షించడంతో ట్రంప్ మరోసారి పుంజుకోవచ్చని టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news