తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే ఏకంగా 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 71, 021 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు కోసం నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 25, 965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్లుగా నమోదు అయింది.
కాగా, రేపటి నుంచే మే నెల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిఫ్ విధానంలో పోందడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొంది టీటీడీ. ఇక 21వ తేదీ మధ్యహ్నం 12 గంటల నుంచి 23వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో టికెట్లు పోందిన భక్తులు వాటిని ఆన్ లైన్ విధానంలో పేపేంట్ చేసి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుంది.