ఏపీలో జిల్లాల వారీగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి జిల్లాలో సగ భాగం చైర్ పర్సన్లుగా మహిళలు ఉంటారని ముందే స్పష్టం చేసిన ప్రభుత్వం అలానే పదవులు ప్రకటించింది. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలకు 4 చొప్పున పదవులు ఇచ్చింది. అలానే శ్రీకాకుళం 6, విశాఖ, కృష్ణా జిల్లాలకు 5 చొప్పున కార్పొరేషన్ పదవులు ప్రకటించింది.
గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 4 చప్పున పదవులు ప్రకటించింది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 56 కులాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ కార్పొరేషన్లకు ఒకే సారి చైర్ పర్సన్ లను కూడా ప్రకటించింది. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి ఆయా కార్పొరేషన్లు తోడ్పాటు అందించన్నాయి. మొత్తం 56 బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించింది ప్రభుత్వం.