New registration charges in AP from January 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విపరీతంగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు అలాగే గ్రామాలలో ఒకేసారి భూ రిజిస్ట్రేషన్ చార్జీలు 15%… పెంచే యోజనలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
భూమి విలువలు పెంచుతున్నట్లు కలెక్టర్ల ప్రతిపాదనలకు జిల్లా కమిటీల… ఆమోదం వచ్చినట్లు చెబుతున్నారు. ఇక డిసెంబర్ 20 వ తేదీన సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డులో సవరణ వివరాలు అంటించబోతున్నారట అధికారులు. డిసెంబర్ 24 వ తేదీ వరకు అభ్యంతరాలు అలాగే సలహాలు స్వీకరించనున్నారు ఉన్నతాధికారులు. ఇక ఆ అభ్యంతరాలు అలాగే సలహాలను స్వీకరించి 27వ తేదీన పరిశీలిస్తారు. జనవరి అంటే కొత్త సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రిజి స్ట్రేషన్ చార్జీలు అమలులోకి వస్తాయి. దీంతో ఏపీ ప్రజలు షాక్ అవుతున్నారు.