ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంది. పూర్వకాలంలో చాలా మంది స్కూల్ కి వెళ్లే వారు కాదు. చదువు అంటే వింతగా చూసేవారు. కొందరూ మాత్రం చదువుకొని చదువులో రాణించేవారు. మరికొందరూ కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమయ్యేవారు. టెక్నాలజీ కి అనుగుణంగా ప్రస్తుతం అందరూ చదువుకుంటున్నారు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
చదువుకోవాలనే తపన, ఆసక్తి ఉండాలి కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన గిరిజన మహిళ పెద్దమ్మి. మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపింది. భద్రగిరి ఏపీఆర్ కేంద్రంలో ఆమె పరీక్ష రాస్తున్నారు.