నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు మహానంది భక్తులు. అటు స్థానికులు ఇళ్లలో కేకలు వేయడంతో అడవిలోకి పరుగు తీసింది ఎలుగుబంటి. గత 2 నెలలుగా టోల్ గేట్ ప్రాంతంలోని సంచరిస్తోంది ఎలుగు బంటి.
ఈ విషయంపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేసినా, లైట్ తీసుకున్నారు అటవీ అధికారులు. ఇక ఇప్పుడు మరోసారి నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఇక అటు విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ తరుణంలోనే… పామును పట్టుకుంది అటవీ శాఖ సిబ్బంది. అయితే..అది విష సర్పం కాక పోవటంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.