జనసేనను వదలని గ్లాస్‌ సింబల్ టెన్షన్.. !

-

ఏపీ ఎన్నికల నేపథ్యంలో జనసేనను సింబల్ టెన్షన్ అస్సలు వదలడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ కు చోటు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఇంత జరిగినా తమకు సింబల్ టెన్షన్ ఏం లేదని చెబుతోంది జనసేన. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే తరహాలో ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుందంటోంది జనసేన.

A big shock for Pawan Kalyan Is the glass mark missing

తెలంగాణలోనూ ఇదే తరహా లొల్లి పెట్టారని గుర్తు చేస్తోంది జనసేన. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసును తమకే కేటాయించామని కేంద్ర ఎన్నుకల సంఘాన్ని కోరతామంటోంది జనసేన. ఇక త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇస్తామని జనసేన వెల్లడించింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అని చెబుతోంది జనసేన. ప్రత్యర్థి పార్టీలు కావాలనే దీన్ని యాగీ చేసే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు జనసేన నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news