దీపావళి పండగ నాడు విషాదం చోటు చేసుకుంది. గుడివాడలో కాలువలోకి దూసుకెళ్లింది ఓ కారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ నియోజక వర్గంలోని పామర్రు మార్గంలో కొండాయపాళెం వద్ద కాలువలోకి ఓ కారు..దూసుకెళ్ళింది.

అయితే.. అదే సమయంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే… కారు అద్దాలు పగలగొట్టి మృతదేహాలను బయటకు తీసిన స్థానికులు.. పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.