చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో ఏనుగుల గుంపు దాడిలో రైతు రామ కృష్ణంరాజు మృతి చెందారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదిలించబోమని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఘటన స్థలానికి చిత్తూరు డీఎఫ్ఓ బయలుదేరి వెళ్లారు. రాత్రి నుంచి మృతదేహం తరలించడానికి స్థానికులు నిరాకరిస్తున్నారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామకృష్ణం రాజు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించేది లేదని తేల్చి చెప్పారు.
చిత్తూరు జిల్లా అవులపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన రైతు రామకృష్ణంరాజు ఏనుగులు గుంపు దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ లో చింతించారు. బాధకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నాను. ఏనుగుల గుంపు వెల్తున్న మార్గాలను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూ.. ఆయా ప్రాంతాల రైతులకు ముందుగా సమాచారం అందించాలని దిశానిర్దేశం చేసారు.