BREAKING: చంద్రబాబుకు షాక్‌..అన్న క్యాంటీన్ల ప్రారంభానికి బ్రేక్‌ ?

-

BREAKING: ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్‌ తగిలింది. అన్న క్యాంటీన్ల ప్రారంభానికి బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్ ఉన్నందున్న విశాఖలోని అన్న క్యాంటీన్లు ప్రారంభానికి నోచుకోడం లేదు. అక్కడ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత… అన్న క్యాంటీన్ల ప్రారంభం ఉంటుంది. కాగా ఇవాళ గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ పర్యటనలో అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.

Chandrababu Naidu, To Launch First Anna Canteen In Gudivada

ఎన్టీఆర్ తొలిసారి ప్రాతినిధ్యం వహించిన గుడివాడలోనే అన్న క్యాంటీన్ల పునః ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.పేదలతో కలిసి గుడివాడ అన్న క్యాంటీనులో భోజనం చేయనున్నారు చంద్రబాబు. గుడివాడలో పేదలతో ఇంటరాక్ట్ కానున్నారు ఏపీ సీఎం. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు జరుగనుంది. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు చంద్రబాబు సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news