తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ తగిలింది. తిరుమలలో ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు విధించింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఓ బాబు కూడా చిరుత దాడిలో మరణించాడు. తిరుమలలో ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తిరుమల శ్రీ వారి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు విధించింది టీటీడీ పాలక మండలి. ఇవాళ్టి నుంచి సెప్టంబర్ 30 వ తేది వరకు ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ పాలక మండలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపింది టీటీడీ పాలక మండలి. సెప్టెంబర్ వరకు చిరుత సంచారం ఎక్కువగా వుండే అవకాశం వుండడంతో అటవిశాఖ అధికార్ల సూచన మేరకు ఆంక్షలు విధిస్తూన్నారు టీటీడీ పాలక మండలి అధికారులు.