ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఇక పై సెల్ ఫోను లో ‘ఆరోగ్య శ్రీ’ పూర్తి వివరాలు తెలుస్కోవచ్చును. సెల్ ఫోను లో ఉన్న ‘ఆరోగ్యశ్రీ’ యాప్ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులు, వైద్య పరీక్షలు, చికిత్స సమాచారం తెలుసుకునేందుకు వీలు కల్పించింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. మెడికల్ రిపోర్టుల డౌన్లోడ్ కూ వెసులుబాటు కల్పించింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
ఆరోగ్యశ్రీ కార్డుదారుల ఫోన్లలో యాప్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దింతో ఇప్పటి వరకూ 6.83 లక్షల మంది పోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా, గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించింది. తొలి దశలో 51, రెండవ దశలో 1,500 గ్రామాల్లో సేవలు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా 2,526 సచివాలయాలకు అనుమతులు మంజూరు చేసింది. అక్కడ పనిచేసే కార్యదర్శులకే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించింది. భూముల రీసర్వే పూర్తయి, LPM(ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.