రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నిమిషానికొక నిబంధనను జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి గారు మారుస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. దళిత యువకుడిని హత్య చేసి ఆయన ఇంటికి శవాన్ని పార్సిల్ చేసిన వ్యక్తికి అదే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సకల సౌకర్యాలను కల్పించారని, మూలాఖత్ ద్వారా ఎవరిని అంటే వారిని కలుసుకునే అవకాశాన్ని కల్పించిన జైలు అధికారులు, ఇప్పుడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని న్యాయవాదులు కలుసుకోవడానికి కూడా ఆంక్షలు విధించడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
చంద్రబాబు నాయుడు గారిని మూలాఖత్ ద్వారా న్యాయవాదులు, ఆయన కుటుంబ సభ్యులు కలుసుకుంటే ఇతర ఖైదీలకు ఇబ్బందిగా ఉందని, అందుకే జైలుల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి గారు నిమిషానికి ఒక నిబంధనను మారుస్తున్నారంటూ రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. విజయవాడ వరకే పరిమితమైన 144 సెక్షన్, ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారని, చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని కలుసుకొని ఆమెకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చే వారిని రాజమండ్రికి రాకుండా నిలువరిస్తున్నారని అన్నారు.