మాజీ మంత్రి విడదల రజిని చిక్కుల్లో పడింది. మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి ఏసీబీ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజినిపై ఏసీబీ కేసు నమోదైంది.

ఆమెతో పాటు అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని కేసు గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.